అమరవీరుల వారోత్సవాలు: శ్రీకాకుళంలో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ
రిపోర్టర్: సురేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాల్ లో భాగంగా ఎచ్చెర్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ శాఖ పనితీరును వారికి వివరించడంతో పాటు, విద్యార్థులతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్ లో దేశభక్తిని పెంపొందించేలా సాగిందని అధికారులు తెలిపారు.