'కరవు రైతులకు నీరు ఇవ్వాలి': తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జలదీక్ష

రిపోర్టర్: హరి స్థలం: అనంతపురం

అనంతపురం హంద్రీనీవా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జలదీక్ష చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో కరవు రైతులకు హంద్రీనీవా, తుంగభద్ర నీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కార్యాలయం సమీపంలోనే ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు Telugufeedsite పేర్కొన్నారు.