రెడ్డివారిపల్లిలో ఓటు హక్ కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఉదయం తన స్వగ్రామమైన రెడ్డివారిపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని స్థానిక ప్రజలతో మాట్లాడి అందరూ ప్రజాస్వామ్య బద్ధంగా ఓటింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు హాజరయ్యారు.