లక్సెట్టిపేట ఉర్దూ బడిలో ఎఫ్ఎల్ఎన్ బృందం ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులకు మార్గదర్శనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించాలని ఎఫ్ఎల్ఎన్ మంచిర్యాల జిల్లా ప్యానల్ టీం సభ్యులు సూచించారు. మంగళవారం లక్సెట్టిపేట పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు తగు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మురళీధర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.