పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన: నిబంధనలు పాటించాలంటూ డీఐజీ హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: Kadapa
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధారణ ఓటరులాగే ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కడప డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రముఖులైనా ఎన్నికల నిబంధనలకు లోబడే ఉండాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్లు కడప నుంచి పోలీసులు వెల్లడించారు.