'జనాభా ప్రాతిపదికన పెంపు': ఏపీలో పురపాలక వార్డుల పునర్విభజన పూర్తి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
అమరావతిలో పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా వాటి సంఖ్య 820 వరకు పెరిగింది. రాష్ట్రంలోని 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న 3,122 డివిజన్లు, వార్డుల సంఖ్య ఏకంగా 3,942కి చేరింది. జనాభా ప్రాతిపదికన చేపట్టిన ఈ పునర్విభజనపై ముసాయిదా అభ్యంతరాల స్వీకరణ అనంతరం పుర కమిషనర్లు తుది నోటిఫికేషన్లు జారీ చేశారు. కోర్టు కేసులున్న మరో 23 సంస్థల్లోనూ త్వరలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.