రేండ్లగూడ ప్రభుత్వ బడిలో ఆంగ్ల వర్క్ బుక్ ఆవిష్కరించిన డీఈవో

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు రూపొందించిన ఆంగ్లభాష రెమీడియల్ వర్క్ బుక్ను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి పి చంద్రయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల కోఆర్డినేటర్లు జంబోజు సత్తయ్య, ఎం భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.