జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సుధాకరరావుకు అరుదైన గౌరవం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
పొదలకూరు మండలం బి.చెర్లోపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.సుధాకరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తించిన విద్యాశాఖ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
గురుపూజోత్సవం సందర్భంగా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా సుధాకరరావు ఈ అవార్డును స్వీకరించారు. విద్యార్థులకు సొంత ఖర్చుతో విద్యాసామగ్రి అందించడం, సాంకేతికతతో బోధన చేయడంపై గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.