బెంగళూరు నిరుద్యోగి సంచలన ఆఫర్: ఉద్యోగం ఇస్తే మొదటి నెల జీతం మీకే
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగళూరు
బెంగళూరుకు చెందిన ఒక బిటెక్ పట్టభద్రుడు ఉద్యోగం కోసం రెడ్ డిట్ వేదికగా వినూత్న ఆఫర్ ప్రకటించారు. తనకు సాఫ్ట్ వేర్ లేదా ఏఐ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పించిన వారికి మొదటి నెల జీతం పూర్తిగా ఇస్తానని తెలిపారు. కృత్రిమ మేధస్సులో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ స్క్రీనింగ్ సిస్టమ్స్ వల్ల ఉద్యోగం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచిత్రమైన ఆఫర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.