రోడ్లపై ప్లైయాష్ లారీల బీభత్సం.. ప్రయాణం నరకం!

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలో ఫ్లైయాష్ లారీలు రోడ్లపై విచ్చలవిడిగా బూడిద రాల్చుకుంటూ ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు ఐదు రోజులుగా ఈ లారీల దూకుడు మరింత ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్లైఓవర్ బ్రిడ్జిపై ప్రయాణించడం నరకంలా మారిందని వాహనదారులు వాపోతున్నారు. మా ఇష్టమంటూ ఎవరికి భయపడకుండా నిబంధనలకు విరుద్ధంగా రెచ్చిపోయి తిరుగుతున్న ఈ లారీలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.