వరద కాలువ వంతెన మరమ్మతు చేయండి.. అధికారులకు వినతి

రిపోర్టర్: Ajay స్థలం: మల్యాల

మల్యాల మండలంలోని ముత్యంపేట వద్ద వరద కాలువ వంతెన దెబ్బతినడంతో కొండగట్టుకు వెళ్లే భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై బీజేపీ నాయకుడు పొనగంటి రమేశ్ స్పందిస్తూ, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ స్వాతికి రమేశ్ వినతిపత్రం అందజేశారు. ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.