కోర్టు ఆవరణలో భీభత్సం: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై ఇనుప రాడ్డుతో మహిళ దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: Nabarangpur
ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్పూర్ జిల్లా ఝరిగ్రామ్ కోర్టు ఆవరణలో సంచలనం చోటుచేసుకుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ కుమార్ పట్నాయక్ పై సన్మతి మాఝి అనే మహిళ ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశారని ఎస్పీ పార్థ కశ్యప్ తెలిపారు. ఈ ఘటనను అడ్డుకునే ప్రయత్నంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ స్మిత లక్రా, కోర్టు ఏఎస్ఐ మీన్కేతన్ గయాత్ లతో పాటు ప్రాసిక్యూటర్ తీవ్రంగా గాయపడ్డారని, నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.