ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నందిగామ

నందిగామ మండలం మొదల్లగూడ గ్రామానికి చెందిన వడ్ల రాజు అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన వైద్యం కోసం రూ.2,20,000 ఎల్ఓసిని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో అందించారు. ఈ సహాయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి ఎమ్మెల్సీ ఎప్పుడూ అండగా ఉంటారని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.