రాజాపేట: వైభవంగా కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అర్చక బృందం వేదమంత్రాలు, మేళతాళాల మద్య శాస్త్రోక్తంగా శ్రీ సూరమాంభ సహిత కంఠమహేశ్వర స్వామి విగ్రహ, ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.