తిరుమల శ్రీవారి హుండీ విదేశీ నాణేలను అందుబాటులోకి తెచ్చిన ఏపీఎన్ఆర్టీ

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

తిరుమల శ్రీవారి హుండీలో లభించిన విదేశీ నాణేలను ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిందని సొసైటీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వీటిని కొనుగోలు చేసి అందమైన పెట్టెల్లో సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి అమెరికా డాలర్ల నాణేలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నాణేలు కావాల్సిన ప్రవాసాంధ్రులు తాడేపల్లిలోని కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని ఆయన సూచించారు.