విశాఖలో ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు సర్వహక్కులు కల్పిస్తున్నాం సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖ నగర పరిధిలోని 11 మండలాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 28,445 కుటుంబాలకు సర్వహక్కులు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవానికి ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతీక అని, త్వరలోనే మరికొందరికి కూడా శాశ్వత హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు.