నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆర్ఆర్బీ పరిధిలో 191 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం నూట తొంభై ఒకటి పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ నాలుగో తేదీ లోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ట్రాన్స్ లేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.