కేరళ టెట్ అడ్మిట్ కార్డులు విడుదల: అభ్యర్థులకు కీలక ప్రకటన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కేరళ
కేరళ పరీక్షా భవన్ కేరళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెప్టెంబర్ విడత హాల్ టికెట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను నవంబర్ పద్నాలుగు, పదిహేను తేదీల్ లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.