ఉపాధి హామీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్: కొత్త ఫిర్యాదుల పరిష్కార నిబంధనలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కొత్త ఫిర్యాదుల పరిష్కార నిబంధనలను తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు. ఇకపై పంచాయతీ, బ్లాక్ మరియు జిల్లా స్థాయిల్ లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. నిర్దేశిత పదిహేను రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకపోతే ఆటోమేటిక్గా పైస్థాయి అధికారికి ఫిర్యాదు వెళ్తుందని, డిజిటల్ విధానంలో దీనిని పూర్తిగా పర్యవేక్షిస్తామని అధికారులు వెల్లడించారు.