రాప్తాడు ఉన్మాది హేమంత్ కు సర్జరీ పూర్తి: మోకాలి పైవరకు కుడి కాలు తొలగింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీసత్యసాయి జిల్లా
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ కు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు సూపరింటెండెంట్ మల్లేశ్వరి వెల్లడించారు. పోలీసుల కాల్పుల్ లో గాయపడిన హేమంత్ కుడి కాలు కుళ్లిపోవడంతో మోకాలి పైభాగం వరకు తొలగించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఎడమ కాలికి కూడా సర్జరీ చేశామని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.