బీసీ జనగణనపై కేంద్రం మోసం: మాజీ మంత్రి జోగు రామన్న
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆదిలాబాద్
బీసీ జనగణనను ఉప కులాల వారీగా చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో ఆయన పాల్గొని బీసీలకు సంఘీభావం తెలిపారు. ఉప కులాల వారీగా జనాభా సేకరించి, ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.