సిద్దిపేట జిల్లా అవతరణ వేడుకలు: మూడు రోజుల పాటు పదేళ్ల పండుగ
రిపోర్టర్: రమేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 9 నుంచి మూడు రోజుల పాటు జిల్లా ప్రగతి, సంస్కృతిని ప్రతిబింబించేలా పదేళ్ల పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు హరీష్ రావు ఆఫీస్ వెల్లడించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెన్ కే రన్, కవి సమ్మేళనం, ఫుడ్ ఫెస్టివల్, భారీ బహిరంగ సభ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.