నిమజ్జనోత్సవంలో రాజకీయ పాటలపై సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
వినాయక నిమజ్జన వేడుకల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు ప్లే చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.