పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజల వినతులు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి

రిపోర్టర్: గోపి స్థలం: బాపట్ల

అద్దంకి నియోజకవర్గంలోని పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి మరియు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వచ్చిన ప్రతి వినతిపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి మారాలని మంత్రి స్పష్టం చేశారు.