ఉత్తరాఖండ్ లో హిమపాతం: కేదార్తాల్ ట్రెక్కింగ్ కు వెళ్లి గల్లంతైన ఎనిమిది మంది
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Uttarakhand
ఉత్తరాఖండ్ లోని కేదార్తాల్ ట్రెక్కింగ్ కు వెళ్లిన పన్నెండు మంది సభ్యుల బృందంలో హిమపాతం కారణంగా ఎనిమిది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గంగోత్రి నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రతికూల వాతావరణం, మంచు చరియల విరిగిపడటం వల్ల మార్గమధ్యంలో చిక్కుకుపోయినట్లు వెల్లడించారు. నలుగురు సురక్షితంగా వెనక్ కి రాగా, మిగిలిన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూడో రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగిస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.