మలేషియా నుంచి స్వగ్రామానికి నిజామాబాద్ వాసి మహేష్ క్షేమంగా జనవాసాలు చేరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: నిజామాబాద్
ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన మహేష్‌ను స్వదేశానికి రప్పించినట్లు అర్వింద్ ఫర్ అస్ కార్యాలయం వెల్లడించింది. విదేశాల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోరిన వెంటనే స్పందించి బాధితుడిని క్షేమంగా స్వస్థలానికి చేర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారైనా తమ కార్యాలయాన్ని సంప్రదించాలని అర్వింద్ ఫర్ అస్ ప్రతినిధులు కోరారు.