రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు: మాక్ పార్లమెంటులోనే ఉండిపోవాలని ఎద్దేవా
రిపోర్టర్: శివ
స్థలం: చండీగఢ్
ప్రధాని కావాలనే ఆశ ఉంటే రాహుల్ గాంధీ జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండిపోవాల్సి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. చండీగఢ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు ప్రచారం చేయడం, పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే విపక్షాల అజెండా అని మండిపడ్డారు. 1984 అల్లర్ల బాధితుల కుటుంబాలకు న్యాయం చేశామని, నిందితులను జైలుకు పంపామని ఆయన స్పష్టం చేశారు.