గ్యాస్ సిలిండర్లపై అదనపు వసూళ్ల గుబులు
రిపోర్టర్: శివ
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ పేరుతో సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం 5 కిలోమీటర్ల లోపు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉండగా, వినియోగదారుల నుంచి అంతులేని దోపిడీ జరుగుతోంది. రసీదులు ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.