యూనిఫామ్ మార్చుకోవాలంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న పంజాబ్ పోలీసులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పంజాబ్

పంజాబ్ పోలీసు సిబ్బంది డ్యూటీకి వెళ్లేటప్పుడు లేదా తిరుగు ప్రయాణంలో యూనిఫామ్ ధరించవద్దంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పంజాబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ అడ్వైజరీ పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ అమరిందర్ రాజా వారింగ్, అకాలీదళ్ నేత బిక్రమ్ మజిథియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించింది.