స్థానిక ఎన్నికల ఓటమి భయంతోనే వైసీపీ విమర్శలు: ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: కడప
స్థానిక సంస్థల ఎన్నికల ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మండిపడ్డారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం అమలు చేశామని, నియోజకవర్గంలో మున్నూ కోట్ల రూపాయలతో రహదారి పనులు చేపడుతున్నామని పుత్తా చైతన్య రెడ్డి స్పష్టం చేశారు.