కడప జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా

రిపోర్టర్: వెంకట్ స్థలం: కడప

కడప జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. విశాఖ ఏజెన్సీ, ఒడిస్సా సరిహద్దుల నుంచి తక్కువ ధరకు మత్తు పదార్థాలను తెచ్చి, యువకులు మరియు విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైలు, బస్సు మార్గాలను ఆసరాగా చేసుకుని గుట్టుగా సాగిస్తున్న ఈ రవాణాపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు ఉమ్మడిగా ముమ్మర దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు.