ఆమనగల్లు పాఠశాలలో ఘనంగా పచ్చదనం కోసం మొక్కల పెంపకం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఈకో క్లబ్స్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ఆమనగల్లు ఎస్సీ కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఇంచార్జ్ హెచ్ఎం సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.