ఓబులవారిపల్లిలో పోషకాహారంతో ఆరోగ్యకరమైన బాల్యంపై అవగాహన సదస్సు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

ఓబులవారిపల్లి-2 అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ గుణవతి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.