ఏపీలో ఉద్యోగులకు భారీ ఊరటగా రెండు డీఏల విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్లో ఉన్న రెండు కరువు భత్యం వాయిదాలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జులై నుంచి 2.73 శాతం, 2025 జనవరి నుంచి 1.82 శాతం చొప్పున డీఏలను చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.