చెర్లోపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ గ్రామ సదస్సు: నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం చెర్లోపల్లి శాంతినగర్లో ఎమ్మార్పీఎస్ రెండో విడత గో టు విలేజ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మందకృష్ణ మాదిగ ఆదేశాలతో నిర్వహించిన ఈ సదస్సులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వావిళ్ల శివయ్య, పుత్తూరు ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. మాదిగల హక్కులు, ఐక్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వినోద్, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, ఎంఎస్పీ అధ్యక్షుడిగా ప్రసాద్, ఎంఎంఎస్ అధ్యక్షురాలిగా రాజేశ్వరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం నేతలు స్పష్టం చేశారు.