రాయ్మోనా నేషనల్ పార్క్ లో పెద్దపులి సంచలనం: అస్సాంలో సురక్షితంగా పట్టివేత

రిపోర్టర్: సతీష్ స్థలం: Kokrajhar

పశ్చిమ బెంగాల్ లోని బుక్సా టైగర్ రిజర్వ్ నుండి దాదాపు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి అస్సాం చేరుకున్న ఒక ఆడపులిని అటవీ అధికారులు సురక్షితంగా బంధించారు. కోక్రాఝర్ జిల్లాలోని రాయ్మోనా నేషనల్ పార్క్ ప్రాంతంలో మానవ సంచారం వైపు దూసుకొచ్చిన ఈ పులిని రెండు రాష్ట్రాల అటవీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అరుదైన వన్యప్రాణి రక్షణ చర్యలను అస్సాం అటవీ శాఖ మంత్రి జయంత మల్లబారువా అభినందించారు.