ఇందిరమ్మ ఇండ్లు మరియు పెన్షన్ల దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: राजन्ना सिरिसिला
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణాలు అలాగే చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ భేటీలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.