తిరుమల మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుపతి

తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్రమైన మాడ వీధులకు టీటీడీ నాలుగు వేదాల పేర్లతో కొత్త నామఫలకాలను ఏర్పాటు చేసింది. తూర్పు మాడ వీధిని రుగ్వేద మార్గంగా, దక్షిణ మాడ వీధిని యజుర్వేద మార్గంగా పిలవనున్నారు. అలాగే పశ్చిమ మాడ వీధిని సామవేద మార్గంగా, ఉత్తర మాడ వీధిని అథర్వణవేద మార్గంగా మర్చారు. ఈ నిర్ణయం వల్ల భక్తులకు గెస్టుహౌస్‌లు, కూడళ్లు సులభంగా గుర్తింపుకు వస్తాయి.