బహుదా వరద ఉధృతి: నేషనల్ హైవేపై పూర్తిగా స్తంభించిన వాహనాల రాకపోకలు

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీకాకుళం

అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బహుదా వరద ఉధృతి పెరిగిందని శ్రీకాకుళం జిల్లా పోలీసు వెల్లడించారు. వరద నీరు జాతీయ రహదారిపైకి చేరడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ నిరంతర పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలను మళ్లిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది స్పష్టం చేశారు.