అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్
రిపోర్టర్: శివ
స్థలం: టెహ్రాన్
అమెరికా లేదా ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి కొత్త దాడులు జరిగినా సైన్యం దీటుగా బదులివ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సాయుధ బలగాలను ఆదేశించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. శత్రువుల దురాక్రమణకు భౌగోళిక పరిమితులు లేకుండా శక్తివంతమైన ప్రతిస్పందన ఉండాలని, పోరు ఎప్పుడు ముగియాలో తామే నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.