విజయనగరం లో ఘనంగా మహాకవి గురజాడ 164వ జయంతి వేడుకలు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం రూరల్లో మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురజాడ స్వగృహంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీలో పాల్గొని గురజాడ ఆశయాలను యువత ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.