విద్యార్థులకు అలర్ట్: జేఈఈ మెయిన్ సెషన్ వన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
జేఈఈ మెయిన్ సెషన్ వన్ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మేరీ పహ్చాన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, జనవరిలో పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.