ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల లబ్ధిదారులకు వాట్సాప్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి లబ్ధిదారులకు వాట్సాప్‌ ద్వారా అధికారికంగా అలాట్‌మెంట్‌ లెటర్లను అందజేయనున్నారు. వాట్సాప్‌ సేవలతో పాటు లబ్ధిదారులు నేరుగా హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తమ అలాట్‌మెంట్‌ లెటర్లను పొందేలా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.