ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా దీపోత్సవం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు

రిపోర్టర్: గోపి స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాది కా దియా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని దీపాలు వెలిగించారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో అజరామరంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.