ఉత్తరాఖండ్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఏఐ ఫోటోల అక్రమం
రిపోర్టర్: సురేష్
స్థలం: ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద ఎంబీబీఎస్ ప్రవేశాల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నలుగురు విద్యార్థులు సమర్పించిన ధృవపత్రాలపై దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు ధర్మవీర్ ఏఐ-సృష్టించిన నకిలీ ఫోటోను ఉపయోగించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. సంబంధం లేని నలుగురు విద్యార్థులు ఆయనను తమ తాతగా తప్పుడు వివరాలు ఇచ్చారని, ఈ కుట్ర వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.