అనంతపురంలో పెళ్లిళ్ల సంక్షోభం: గ్రామాల్లో రైతులకు వధువులు దొరకడం గగనం
రిపోర్టర్: సురేష్
స్థలం: Anantapur
అనంతపురం జిల్లాలో గ్రామాల్లోని రైతులకు వివాహాలు కష్టమవుతున్నాయని బెంగళూరు వ్యాపారవేత్త జాని వెల్లడించారు. సోషల్ మీడియా ప్రభావంతో యువతులు గ్రామాల్లో కాపురం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, నగర జీవితాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు నగారానికి మారలేకపోతుండటంతో, కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో సంబంధాలు వెతుకుతున్నాయని పేర్కొన్నారు.