ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.