మారుతి సుజుకి ఈవీ ఎగుమతులలో సరికొత్త మైలురాయి: 50 వేల యూనిట్లు దాటింది
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులలో సరికొత్త మైలురాయిని అధిగమించినట్లు కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే యాభై వేల యూనిట్ల ఈవీల ఎగుమతి మార్కును దాటినట్లు స్పష్టం చేసింది. గుజరాత్ ప్లాంట్లో తయారవుతున్న ఈ-విటారా ఎస్యూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ లభిస్తోందని, సుమారు యాభై దేశాలకు ఎగుమతులు కొనసాగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.