పులిచింతల జలవిద్యుత్ కేంద్రంలో మంత్రులు మల్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: సూర్యాపేట

పులిచింతల జలవిద్యుత్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించినట్లు తెలిపారు. విద్యుత్ కేంద్రం పనితీరు, నిర్వహణపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించామని, ప్లాంట్ రోజువారీ కార్యకలాపాలు, ఉత్పత్తి సామర్థ్యంపై చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్ట్ భద్రతా చర్యలు, సాంకేతిక అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.