మున్సిపల్ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కేటగిరీల వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ ఆమోదం మేరకు జీవో నంబర్ 244 జారీ చేశామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల రెండు వందల అరవై మంది ఉద్యోగులు నేరుగా లబ్ధి పొందుతారని, అర్హులైన సిబ్బందికి త్వరలోనే అన్ని ప్రయోజనాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.